మిత్రుడా రారమ్ము మైత్రితో పార మార్థికమైన మాటల్ వచింతు మన్ననతో విను Lyrics

మిత్రుడా రారమ్ము మైత్రితో పార  మార్థికమైన  మాటల్ వచింతు  మన్ననతో విను Lyrics - mano


మిత్రుడా రారమ్ము - మైత్రితో పార - మార్థికమైన - మాటల్ వచింతు - మన్ననతో విను
Singer mano
Composer Shri. Devadas Mungamuri
Music Jonah Samuel
Song WriterShri. Devadas Mungamuri

Lyrics

మిత్రుడా రారమ్ము - మైత్రితో పార - మార్థికమైన - మాటల్ వచింతు - మన్ననతో విను



 



 



పూర్వ జన్మము నందు - పూర్తిగా పాపిని



అందుకె ఈ బాధ - పొందుచునున్నాను



అని యిట్లు మనస్సులో - అనుకొననే వద్దు



అది నిజమే యైన - అది కూడ పోగొట్టు



రక్షకుడున్నాడు - తత్క్షణమె రమ్ము ఆయన మానవుడై



నట్టి దేవుండు ఈ మాట నమ్మిన - ఎంత ధన్యుండవు



మనస్సులో ముద్రించు - కొని శాంతి పొందుము



 



ఈ జన్మమున గూడ - ఎన్నెన్నో పాపాలు



చేసియున్నందున - చివరకు నరకంబె



అని ఆత్మయందున - ఆలోచనెందుకు



అవి సిల్వపై యేసు - అంతరింప జేసె



ఆ వృత్తాంతంబును - ఆనందమున నమ్మి



సుఖముగ నుండుము సూక్ష్మ మార్గంబిది



ఎందరెన్నియన్న ఏ మాటల్ వినవద్దు



దేవ వాక్కె నిజము - దిక్కులు చూడకు



 



 



దివ్య దేవుడు నిన్ను - దీవించును గాక



భూమి చేసిన వాడు - పోషించును గాక



రక్షకుండౌ క్రీస్తు - రక్షించును గాక



పరమ వైద్యుడు స్వస్థ - పరచు చుండును గాక



పనులన్నిని సఫల - పరచు చుండును గాక



దైవాత్మ ధైర్యంబు - తెచ్చు చుండును గాక



అంతాన మోక్షంబు - అందజేయును గాక



విజయము ఈ పాట - విను వారి కామెన్




మిత్రుడా రారమ్ము - మైత్రితో పార - మార్థికమైన - మాటల్ వచింతు - మన్ననతో విను Watch Video



Post a Comment

Previous Post Next Post